![]() |
![]() |

బుల్లితెర సీరియల్స్ లో కనిపించే శ్రీవాణి జంట త్వరలో హోటల్ స్టార్ట్ చేయబోతున్నారు. శ్రీవాణి ఆమె భర్త విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతీ ఈవెంట్ లో వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఫుల్ పాపులర్. వీళ్ళతో పాటు వీళ్ళ అమ్మాయి రాజ నందిని కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక వీళ్ళు హోటల్ కి కావాల్సిన సామాన్లు కొనే వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసింది శ్రీవాణి. ఇక హోటల్ పేరును విక్రమ్ పెట్టారట. అదే "మీ కడుపునిండా" అంట. విక్రమ్ వేరే పనుల్లో బిజీగా ఉండడంతో కిచెన్ కి సంబంధించిన వంట పాత్రలు కొనడం వంటి వాటి గురించి తాను చూసుకుంటున్నట్టు చెప్పింది శ్రీవాణి. అలాగే పెద్ద పెద్ద చిమ్నీలు, చిన్నవి వాటి సైజు , వాటి కాస్ట్ డిస్కౌంట్ ఇలాంటివి అన్నీ కూడా చూపించింది శ్రీవాణి. "చంద్రముఖి నగల్ని చూసి ఎలా ఆనందపడుతుందో ఇంట్లో ఆడవాళ్ళకు వంట ఫాస్ట్ గా ఈజీగా ఐపోవాలంటే ప్రెజర్ కుక్కర్స్ ని చూస్తే వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉంటారు" అంటూ లేడీస్ ని చంద్రముఖితో పోల్చింది శ్రీవాణి.
రాబోయే రోజుల్లో పండగలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి.. ఇంట్లోకి కూడా పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కుంటే ఇంటికి వచ్చే చుట్టాలకు కూడా వండిపెట్టడానికి సరిపోతాయి అని చెప్పింది శ్రీవాణి. ఇక వీళ్లంతా సామానులు కొనే హడావిడిలో ఉంటే రాజా నందిని మాత్రం సెల్ఫీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. అలాగే పూజా సామగ్రి, బ్లాంకెట్స్, కార్పెట్స్ అన్నిటినీ చూపించింది. రీసెంట్ శ్రీవాణి- విక్రమ్ ఇద్దరూ వైల్డ్ కార్డు ఎంట్రీతో "నీతోనే డాన్స్" షోకి వచ్చారు చివరికి ఎలిమినేట్ ఇపోయారు. శ్రీవాణి కలవారి కోడలు, కాంచన గంగ, మావి చిగురు, మనసుమమతా ఇలాంటి ఎన్నో నటించింది.
![]() |
![]() |